Home తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి-sangareddy fire accident...

సంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం, కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి-sangareddy fire accident sb organics reactor blast five workers spot dead few injured ,తెలంగాణ న్యూస్

0

రియాక్టర్ పేలి భారీగా మంటలు

చందాపూర్ సమీపంలో నిర్వహిస్తోన్న కెమికల్ పరిశ్రమలో ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో 50 మంది కార్మికులు పరిశ్రమలో ఉన్నట్లు సమాచారం. రియాక్టర్ పేలి మంటలు వ్యాపించాయని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మంటలు వేగంగా(Fire accident) వ్యాపించడంతో కార్మికులు బయటకు రాలేకపోయారని అంటున్నారు. రియాక్టర్ పేలి భవన శిథిలాలు దాదాపు ఐదు మందల మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఘటనాస్థలికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంలో ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలిని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పరిశీలించారు.

Exit mobile version