Home తెలంగాణ తల మొండెం వేరు- డిప్లొమా విద్యార్థి అభిలాష్ కేసులో మిస్టరీ? హత్యా-ఆత్మహత్యా?-karimnagar crime diploma student...

తల మొండెం వేరు- డిప్లొమా విద్యార్థి అభిలాష్ కేసులో మిస్టరీ? హత్యా-ఆత్మహత్యా?-karimnagar crime diploma student abhilash death mystery police tracking friends calls ,తెలంగాణ న్యూస్

0

బర్త్ డే రోజే

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటకు చెందిన ఎనగంటి అభిలాష్ మార్చి 1న బర్త్ డే సందర్భంగా కళాశాల మిత్రులతో కలిసి హాస్టల్ నుంచి బయటకు వచ్చి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. కళాశాలకు తిరిగి వచ్చిన అభిలాష్(Abhilash Case) పని ఉందని మిత్రులకు చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. హాస్టల్ వార్డెన్ తోపాటు తోటి మిత్రులు పేరెంట్స్ కు సమాచారం అందించారు. తండ్రి ఎనగంటి శ్రీనివాస్ మార్చి 3న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎల్ఎండీ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభిలాష్ ఆచూకీ మాత్రం లభించలేదు. చివరకు మార్చి 27న అలుగునూర్ కు చెందిన ఓ అమ్మాయి చనిపోతానని డయల్ 100 కు ఫోన్ చేయగా… ఫోన్ చేసిన లొకేషన్ ఆధారంగా తిమ్మాపూర్ సమీపంలోని బావుల్లో పోలీసులు గాలిస్తుండగా ఎంజేపీ పాఠశాల సమీపంలోని వ్యవసాయబావిలో అభిలాష్ తలలేని మృతదేహం లభించింది. అభిలాష్ ఇన్ స్టాగ్రామ్ పరిశీలించగా ప్రేమ విఫలమై, ఇక ఉండి లాభం లేదన్నట్టుగా పోస్టులు పెట్టాడని దీనిని ఆధారంగా చేసుకుని అతడు లవ్ లో ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు సీఐ స్వామి తెలిపారు. అయితే అభిలాష్ మృతిపై తండ్రి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తూ… ఫిర్యాదు చేయడం, తల లేకపోవడం అనుమానాలకు మరింత బలం చేకూరింది.

Exit mobile version