వలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలపై కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. మూకుమ్మడి రాజీనామాలతో వలంటీర్ల నిజస్వరూపం బయట పడిందన్నారు. మీడియాతో మచిలీపట్నంలో మాట్లాడిన కొల్లు రవీంద్ర.. ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా వలంటీర్లు వెళ్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కూడా వలంటీర్లను కొనసాగిస్తామన్నారే గానీ ఎక్కడా తొలగిస్తామని చెప్పలేదన్నారు.