Home అంతర్జాతీయం Heatwave alert : తెలంగాణ, ఆంధ్రకు హీట్​ వేవ్​ అలర్ట్​- ఇతర రాష్ట్రాలకు కూడా!

Heatwave alert : తెలంగాణ, ఆంధ్రకు హీట్​ వేవ్​ అలర్ట్​- ఇతర రాష్ట్రాలకు కూడా!

0

Hyerabad heat waves news : రాబోయే నెలల్లో అనేక భారతీయ రాష్ట్రాలకు ‘విపరీతమైన వేడి’ ఉంటుందని ఏప్రిల్ 1 న ఐఎండీ అంచనా వేసింది. ఈ సమయంలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతయని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఏప్రిల్​లో మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలోని పరిసర ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు కనిపిస్తాయని వివరించింది. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చి చెప్పింది.

Exit mobile version