Home తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు పొడిగింపు, పరీక్షల షెడ్యూల్ విడుదల-hyderabad ts dsc 2024...

డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్- దరఖాస్తు గడువు పొడిగింపు, పరీక్షల షెడ్యూల్ విడుదల-hyderabad ts dsc 2024 exam dates confirmed applications last date extended upto june 20th ,తెలంగాణ న్యూస్

0

TS DSC Updates : తెలంగాణ డీఎస్సీ(TS DSC) అభ్యర్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 11,062 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు డీఎస్సీ దరఖాస్తులను(DSC Applications Extended) జూన్ 20 వరకు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అభ్యర్థులు రూ.1000 దరఖాస్తు రుసుము చెల్లించి జూన్ 20వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. దీంతో పాటు డీఎస్సీ పరీక్షల(TS DSC Exam Schedule) తేదీలను అధికారులు ఖరారు చేశారు. జులై 17 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version