Home తెలంగాణ కాకతీయుల శిల్పాలను కాపాడుకోవాలి! | kakatiya shilpalu history| Kakatiya Dynasty| kakatiya shilpalu|kakatiya sculpture...

కాకతీయుల శిల్పాలను కాపాడుకోవాలి! | kakatiya shilpalu history| Kakatiya Dynasty| kakatiya shilpalu|kakatiya sculpture history

0

posted on Apr 2, 2024 12:57PM

800 ఏళ్ల నాటి సప్తమాతల శిల్పాలను కాపాడుకోవాలి!

 చారిత్రక శిల్పాలపై రంగులు వెయ్యొద్దు 

– ప్రాచీనతకు భంగం అంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి

800 సంవత్సరాల నాటి కాకతీయుల శిల్పాలపై రంగుల వేసి ప్రాచీనతకు భంగం కలిగించవద్దని, రంగులు తొలగించి కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, ఈమని శివనాగిరెడ్డి అన్నారు. మాల్ శివారులోనున్న గొడగండ్ల గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలోని సప్తమాతృకల శిలాఫలకం రెండు ముక్కలై, ఒకటి ప్రాకారం గోడకు బిగించి ఉండగా, మరొకటి మండప ద్వారానికి ఎడమవైపున బిగించి ఉన్నాయని, వాటిపై వేసిన నలుపు రంగు చరిత్రను చెరిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నాడు ఆ విగ్రహాలను పరిశీలించిన శివనాగిరెడ్డి ఆలయ ధర్మకర్తల  మండలి ఛైర్మన్, అంగిరేకుల గోపాల్, సభ్యులు ఇరుకుల రామ్మోహన్, కడారి జంగయ్య, గ్యారా ఉమా యాదయ్య, తుగిరి వెంకటయ్య, వంగూరు శ్యాంసుందర్, అర్చకులు వైద్యుల ప్రవీణ్ శర్మ, బాపతు సత్యనారాయణ రెడ్డిలకు శిల్పాల చారిత్రక ప్రాధాన్యతను వివరించి అవగాహన కల్పించారు.

 

Exit mobile version