Thursday, January 23, 2025

అధికారులను బదిలీ చేసిన ఈసీ  | EC who transferred the officers

posted on Apr 2, 2024 5:10PM

ఎపి రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది.ఏపీలో మరి కొన్ని వారాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్ అధికారులను, ముగ్గురు ఐఏఎస్ అధికారులను నేడు బదిలీ చేస్తూ, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను, గుంటూరు రేంజి ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది. అంతేకాదు, బదిలీ అయిన వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana