posted on Apr 2, 2024 5:10PM
చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిలను, గుంటూరు రేంజి ఐజీ పాలరాజును బదిలీ చేసింది. కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీషాను బదిలీ చేసింది. అంతేకాదు, బదిలీ అయిన వారు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని ఈసీ ఆదేశించింది.