MS Dhoni batting today : ఐపీఎల్లో ఇతర టీమ్స్ ఫ్యాన్స్ పరిస్థితి ఒకటి.. చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల పరిస్థితి ఒకటి! ఎవరైన వికెట్ పడకూడదు, వికెట్ పడకూడదు అనుకుంటారు. కానీ సీఎస్కే ఫ్యాన్స్ మాత్రం.. వికెట్ పడాలి, వికెట్ పడాలి అని ప్రార్థిస్తుంటారు. ఎందుకంటే.. వికెట్ పడితేనే కదా మహేంద్ర సింగ్ ధోనీ క్రీజ్‌లోకి వస్తాడు- ధనాధన్ షాట్స్‌తో అలరిస్తాడు! ఆదివారం డీసీతో జరిగిన మ్యాచ్‌లో.. సీఎస్కే ఫ్యాన్స్ ఆశలు నెరవేరాయి! ఐపీఎల్2024లో తొలిసారిగా బ్యాటింగ్‌కి దిగిన ధోనీ.. చలరేగి ఆడాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ధోనీ కొట్టిన షాట్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వీరిలో.. టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమచారి శ్రీకాంత్ కూడా ఒకరు. అసలు ధోనీకి 42ఏళ్లంటే.. నమ్మలేమని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.