Home తెలంగాణ ఆత్మ హత్యకు పాల్పడిన జర్నలిస్ట్ రఘు

ఆత్మ హత్యకు పాల్పడిన జర్నలిస్ట్ రఘు

0

జూబ్లీహిల్స్ :- కుటుంబ కలహాల కారణంగా ఉరి వేసుకుని ఒక ఈ టీవీ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది, వివరాలకు వెళ్తే జూబ్లీహిల్స్ బోరబండ సైడ్ 3 ప్రాంతానికి చెందిన రఘు( 49 )అనే వ్యక్తి వెస్ట్ జోన్ పరిధిలో ఒక Eటీవీ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు, అయితే సోమవారం ఇతర జర్నలిస్టులతో కలిసి ఉద్యోగానికి వెళ్ళిన రఘు 11 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళాడు, ఏమైందో తెలియదు గానీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరివేసుకొని చనిపోయాడు కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించాడు వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు,అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు.రఘు ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని కుటుంబ సభ్యులు, స్నేహితులు తెలిపారు మరణాన్ని గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version