Home తెలంగాణ Khammam Tribal Attacked Police :ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, పోడు భూముల విషయంలో పోలీసులపై...

Khammam Tribal Attacked Police :ఖమ్మం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత, పోడు భూముల విషయంలో పోలీసులపై గిరిజనులు దాడి

0

గిరిజనుల మధ్య వివాదం

చంద్రాయపాలెంలో గిరిజనుల ఘర్షణపై(Tribal Issues) సమాచారం అందుకున్న సత్తుపల్లి సీఐ కిరణ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాలతో మాట్లాడుతున్న క్రమంలో ఓ వర్గం కర్రలు తీసుకుని పోలీసులపై దాడికి పాల్పడింది. గిరిజనుల దాడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. అయినా గిరిజనులు పెద్ద పెద్ద కర్రలతో పోలీసులను వెంబడించి దాడికి చేశారు. దీంతో సీఐ కిరణ్ తో పాటు పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. పోలీసులు ఎంత చెప్పినా గిరిజనులు వినిపించుకోలేదు. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు బైక్ పై వెళ్తుండగా గిరిజనులు వారిని అడ్డగించి బైక్ పై నుంచి కిందకి లాగి దాడిచేశారు. గిరిజనుల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి వెళ్లిన పోలీసులపైనే తిరిగి దాడి జరిగింది. అసలు వివాదం ఎందుకు చోటుచేసుకుందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

Exit mobile version