Home తెలంగాణ 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య, ఎందుకొచ్చిందీ దుస్థితి- కేసీఆర్-suryapet brs...

100 రోజుల కాంగ్రెస్ పాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య, ఎందుకొచ్చిందీ దుస్థితి- కేసీఆర్-suryapet brs chief kcr alleged congress govt reason for farmers distress paddy dried up conditions in telangana ,తెలంగాణ న్యూస్

0

రైతులకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది?

ప్రభుత్వం ముందుగా నీళ్లు (Water Crisis)ఇస్తామని చెప్పిందని అందుకే రైతులు పంటలు వేశారని, ఇప్పుడు సాగునీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. పంటలు ఎండిపోయి చాలాచోట్ల రైతులు(Farmers) కన్నీరు మున్నీరై విలపిస్తున్నారన్నారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తగిన పరిహారం ఇప్పించాలని వేడుకుంటున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదనే ఉద్దేశంతో పనిచేసిందన్నారు. అందుకే రైతులకు ముందుగా సాగునీళ్లు అందించామని, పెట్టుబడి సాయం రైతు బంధు సమయానికి ఇచ్చామన్నారు. సాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా కరెంట్ అందజేశామన్నారు. గత ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి నేరుగా పంటలను కొనుగోలు చేసిందన్నారు. రైతు బీమాతో పాటు వివిధ అద్భుతమైన విధానాలను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్‌ తెలిపారు.

Exit mobile version