Hyderabad Leh Tour : స్కూళ్లకు, కాలేజీలకు సమ్మర్ హాలీడేస్(Summer) స్టార్ట్ అవుతున్నాయి. కుటుంబంతో హాలీడే ట్రిప్(Holiday Trip) ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి లడఖ్ లేహ్(Hyderabad To Leh) ఎయిర్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ లో ల్యాండ్ ఆఫ్ పాసెస్ గా పేరొందిన లడఖ్ లోని సుందర ప్రదేశాలను చుట్టేసి రావొచ్చు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC Tour Package) హైదరాబాద్ నుంచి లడఖ్‌కు ఎయిర్ ప్యాకేజీ ప్రారంభించింది. ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి లడఖ్‌కు ఫిక్స్‌డ్ డిపార్చర్ టూర్‌లను ప్రారంభించింది. ఈ టూర్ లో షామ్ వ్యాలీ, లేహ్, నుబ్రా, టర్టుక్ , పాంగోంగ్ ప్రాంతాలను కవర్ చేస్తారు. ఐఆర్సీటీసీ(IRCTC) లడఖ్ టూర్ ప్యాకేజీలో పర్యాటకలను మంత్ర మంత్రముగ్ధులను చేసే సుందరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. టూర్ ప్రారంభ తేదీ మే 21, 2024.