కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో మానసిక స్థితి సరిగా లేని వృద్ధురాలు గడ్డం మల్లీశ్వరి (70) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. బావి సమీపంలో నివాసముంటున్న దివ్యాంగుడు బండారి రవి భార్య గమనించి భర్తకు సమాచారం ఇచ్చింది. దివ్యాంగుడైన రవి కాలు కదలలేని స్థితిలో ఉన్నప్పటికీ, ఏ మాత్రం ఆలోచించకుండా బావిలోకి దూకేశాడు. నీటమునిగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వృద్ధురాలు మల్లీశ్వరిని సేవ్ చేసి తన కాళ్లపై ఆమె తల పెట్టి కరెంటు మోటర్ బెల్టు సాయంతో నీటిలోని ఉండిపోయాడు. 20 నిమిషాల పాటు ఆమెను అలాగే కాపాడిన క్రమంల సమాచారం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని వృద్ధురాలిని తాళ్ళ సాయంతో బయటకు తీశారు. చికిత్స నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధురాలు మల్లీశ్వరీ ఆరోగ్యంగా ఉన్నారు.