Home బిజినెస్ Skoda Kodiaq: బంపర్ ఆఫర్.. స్కోడా కొడియాక్ పై ఏకంగా 2 లక్షల డిస్కౌంట్

Skoda Kodiaq: బంపర్ ఆఫర్.. స్కోడా కొడియాక్ పై ఏకంగా 2 లక్షల డిస్కౌంట్

0

మూడవ వరుస సీట్ కూడా..

మరోవైపు, స్కోడా కొడియాక్ ఎల్ అండ్ కె (Skoda Kodiaq L&K variant) ధరను సంస్థ రూ .2 లక్షలు తగ్గించింది. ఈ ఈ తగ్గింపు అనంతరం ఈ లగ్జరీ కారు ధర రూ .39.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరింది. ఈ ధర తగ్గింపునకు కారణమేంటనే విషయాన్ని స్కోడా వెల్లడించలేదు. కానీ, ఈ రూ. 2 లక్షల డిస్కౌంట్ అనంతరం, సౌకర్యవంతమైన, విలాసవంతమైన స్కోడా కొడియాక్ ఎస్యూవీని ఇంటికి తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా కనిపిస్తోంది. టాప్-నాచ్ బిల్డ్ క్వాలిటీ, ఫీచర్-రిచ్ క్యాబిన్ కు స్కోడా కొడియాక్ (Skoda Kodiaq) పెట్టింది పేరు. స్కోడా కొడియాక్ లో సౌకర్యవంతమైన రెండు వరుసల సీట్లతో పాటు, అవసరమైతే, ఉపయోగించదగిన మూడవ వరుస సీట్లను కూడా ఉపయోగించుకునేలా రూపొందించారు.

Exit mobile version