Home తెలంగాణ Ration Rice Seized : కాళేశ్వరం వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Ration Rice Seized : కాళేశ్వరం వద్ద భారీగా రేషన్ బియ్యం పట్టివేత

0

Ration Rice Seized: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో కాళేశ్వరం వద్ద భారీగా రేషన్ బియ్యం(Ration Rice Seized at Kaleshwaram) పట్టుబడ్డాయి. స్థానిక అధికారుల కళ్లుగప్పి అక్రమంగా రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న రెండు లారీలు, మరో రెండు బొలేరో ట్రాలీ వాహనాలను హైదరాబాద్ కు చెందిన సివిల్ సప్లై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సుమారు 900 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని, వాహనాలను సీజ్ చేసి, నలుగురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాలను, నలుగురు నిందితులను మహాదేవ్ పూర్ పోలీసులకు అప్పగించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి టన్నుల కొద్ది బియ్యం సరిహద్దుల దాటి మహారాష్ట్ర కు తరలి పోయినా స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కు చెందిన అధికారులు దాడులు చేసి భారీ మొత్తంలో బియ్యాన్ని పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version