posted on Mar 23, 2024 2:21PM
ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం గూటికి చేరారు. ఆయన కాంగ్రెస్ తరఫున లోక్ సభ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయారు కూడా. అలాగే మాజీ మేయర్, గ్రేటర్ పరిధిలో గట్టి పట్టున్న బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పంచన చేరారు. ఇప్పుడు తాజాగా మేయర్ విజయలక్ష్మి సైతం కారు దిగిపోయి చేయందుకోవడానికి రెడీ అయిపోయారు.
నిజానికి శుక్రవారం (మార్చి 22) సాయంత్రమే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ చేరిక లాంఛనం పూర్తైపోతుందని అంతా భావించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ స్వయంగా ఆమెను కలిశారు. ఈ భేటీలో గద్వాల విజయలక్ష్మి తండ్రి కేకే కూడా ఉన్నారు. ఈ భేటీ కేకే నివాసంలోనే దాదాపు గంట సేపు జరిగింది. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా దీపాదాస్ మున్షీ.. వారిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే పలు ప్రతిపాదనలు దీపాదాస్ మున్షీ ముందు ఉంచగా, వాటిపై పార్టీలో చర్చించిన అధిష్ఠానం వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విజయలక్ష్మి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.