posted on Mar 23, 2024 5:13PM
సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
పద్మారావు గౌడ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మోండా మార్కెట్ నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై కార్పొరేటర్‌గా గెలిచారు. గత రెండు వారాలుగా సికింద్రాబాద్ లోకసభ అభ్యర్థి విషయంలో బిఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పేర్లు వినిపించినప్పటికీ ఎట్టకేలకు శనివారం పద్మారావ్ గౌడ్ పేరు ఖరారయ్యింది. బిఆర్ ఎస్ అధినేత కెసీఆర్ తలసానిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేకపోవడంతో పద్మారావ్ పోటీ చేయడం అనివార్యమైంది.