Home తెలంగాణ రజాకార్ చిత్ర నిర్మాతకు 1ప్లస్ 1 భద్రత.. కేంద్ర హోంశాఖ నిర్ణయం | union home...

రజాకార్ చిత్ర నిర్మాతకు 1ప్లస్ 1 భద్రత.. కేంద్ర హోంశాఖ నిర్ణయం | union home ministry 1+1 security to razakar producer| guduru| satyanarayana| threat

0

posted on Mar 22, 2024 9:16AM

రజాకార్ చిత్ర నిర్మాతకు భద్రత కల్పించిన కేంద్ర హోంశాఖ. ఇటీవల విడుదలైన ‘రజాకార్‌’ చిత్రాన్ని నిర్మించిన గూడురు సత్యనారాయణకు కేంద్ర హోంశాఖ 1ప్లస్ 1 భద్రత కల్పించింది. హైదరాబాద్ విలీనం నాటి యదార్థ ఘటనలతో ఆయన నిర్మించిన చిత్రం అలరిస్తున్నప్పటికీ, కొందరి నుంచి ఆయనకు బెదరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్రం వచ్చింది. కానీ, అప్పుడు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ మాత్రం 7వ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ అధీనంలోనే ఉంది. దేశంలో హైదరాబాద్‌ను విలీనం చేయకుండా ముస్లిం రాజ్యం ఏర్పాటు చేసేందుకు మీర్ ఉస్మాన్ ఖాన్  ప్రయత్నించాడు. నిజాం సైనికాధికారి ఖాసీం రజ్వీకి బాధ్యతలు అప్పగించాడు. దీంతో రజ్వీ అరాచకాలతో తెలంగాణలో విధ్వంసం సృష్టించాడు. అప్పటి కేంద్ర హోంమంత్రి  వల్లభాయ్‌ పటేల్‌ చొరవవల్ల హైదరాబాద్‌ని దేశంలో విలీనం చేసి మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్థాన్‌ పారిపోయాడు. అతని అధీనంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల కష్టాలను ‘రజాకార్‌’ సినిమాలో ఇప్పటి ప్రజలకు అర్థమయ్యేలా చూపించారు. 

ఈ సినిమాను అసెంబ్లీ ఎన్నికలకు ముందే రిలీజ్‌ చెయ్యాలని భావించారు దర్శకనిర్మాతలు. అయితే అది వీలుపడలేదు.  ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల  ముందు ఈ  సినిమీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్ర నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. దీంతో ఆయన ఫిర్యాదు మేరకు కేంద్ర హోం శాఖ వెంటనే ఆయనకు 1+1 సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లను భద్రత నిమిత్తం కేటాయించింది.  

Exit mobile version