Home అంతర్జాతీయం Supreme Court: ‘ఈ సమయంలో స్టే ఇవ్వలేం’- ఈసీల నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు స్పందన

Supreme Court: ‘ఈ సమయంలో స్టే ఇవ్వలేం’- ఈసీల నియామకాల చట్టంపై సుప్రీంకోర్టు స్పందన

0

Supreme Court on ECs appointment: ఎన్నికలకు ముందు గందరగోళం సృష్టించే అవకాశం ఉన్నందున ఈ దశలో ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన చట్టంపై స్టే ఇవ్వలేమని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. 2023 లో కేంద్రం రూపొందించిన కొత్త చట్టంలో ఎన్నికల కమిషనర్ల నియమించే ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించారు. దీనిపై ఒక స్వచ్చంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కొత్త ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడడం గమనార్హం. పూర్తి వివరాలతో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ల ధర్మాసనం సూచించింది. 2023 చట్టం ప్రకారం చేసిన నియామకాలపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన ధర్మాసనం, “సాధారణంగా, మేము మధ్యంతర ఉత్తర్వుల ద్వారా చట్టంపై స్టే ఇవ్వము” అని తెలిపింది. అనంతరం, ఆ పిటిషన్లపై విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.

Exit mobile version