Home ఎంటర్టైన్మెంట్ Guppedanta manasu march 21st: గుప్పెడంత మనసు.. అల్లాడించేసిన తల్లీకొడుకులు.. అందరి ముందు నిజం బయట...

Guppedanta manasu march 21st: గుప్పెడంత మనసు.. అల్లాడించేసిన తల్లీకొడుకులు.. అందరి ముందు నిజం బయట పెట్టిన మను

0

శత్రువులు ఎవరో కనిపెట్టాలన్న ఫణీంద్ర

ఫణీంద్ర మహేంద్రకి ఫోన్ చేసి అనుపమకి ఎలా ఉందని ఆరా తీస్తాడు. అటాక్ చేసిన వాడిని పట్టుకోవాలని అసలు వదిలిపెట్టొద్దని ఫణీంద్ర చెప్తాడు. అసలు మను మీద అటాక్ జరగడం ఏంటి? తను ఎవరికీ ఏ హాని చేసింది లేదు తన మీద ఎందుకు అలా చేసి ఉంటారని అనుమానపడతాడు. కొంతమంది మంచి వాళ్ళ మీద దుర్మార్గులు చేశారని మహేంద్ర అంటాడు. మన శత్రువులు మను మీద అటాక్ చేసి ఉంటారని ఫణీంద్ర అంటే అన్ని విషయాలు తొందర్లోనే బయట పెడతానని మహేంద్ర చెప్తాడు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు మను అనుపమ కొడుకు ఏంటని అంటే నాకు తెలియదని మహేంద్ర అంటాడు. దేవయాని ఫోన్ తీసుకుని అనుపమ మీద లేనిపోని ప్రేమ తెగ నటించేస్తుంది.

Exit mobile version