దుగ్గిరాల వారసుడు…
ఆ చిన్నారి తన కొడుకేనని రాజ్ ప్రకటిస్తాడు. తన రక్తం పంచుకొని పుట్టిన తనయుడని చెబుతాడు. ఆ చిన్నారి ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడని, దుగ్గిరాల వంశ వారసుడిగా పెరుగుతాడని రాజ్ చెబుతాడు. అతడి మాటలతో ప్రతి ఒక్కరూ షాకవుతారు. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.