Friday Motivation: దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక… ఈ మూడు ఎక్కడ ఉంటాయో విజయం అక్కడ తప్పక దక్కి తీరుతుంది. ఏదైనా సాధించాలన్న సంకల్పం ఒక మనిషిలో నరనరాన జీర్ణించు పోవాలి. తాను అనుకున్నది సాధిస్తానన్నా నమ్మకం తనపై తనకు ఉండాలి, ఆ విజయాన్ని సాధించాలన్న కోరిక మనసులో నాటుకుపోవాలి. అప్పుడే అనుకున్న దాన్ని అందుకోవడం సులభం అవుతుంది.