Home తెలంగాణ తీన్మార్ మల్లన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలి

తీన్మార్ మల్లన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలి

0

తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కృషి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ అన్నారు.ఉప్పల్ లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం కార్యాలయంలో బీసీ ప్రజా సంఘం నాయకులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన ఏ ఒక్క బీసీ నాయకునికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు.ఇంకా కొన్ని కార్పొరేషన్లు మిగిలి ఉంటే వాటికి బీసీ నాయకులను నియమించాలి అని కోరారు.గత ప్రభుత్వ పని తీరును ఎండ గట్టిన,అనేక కేసుల మోపి జైలు జీవితం గడిపిన తీన్మార్ మల్లన్నకు ఎపి టికెట్ కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి అని సూచించారు.కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరినీ గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పించాలి అని సూచించారు.

Exit mobile version