Home తెలంగాణ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush in tirumala| compartments| full| pilgrims|...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | devotees rush in tirumala| compartments| full| pilgrims| tonsures| hundi

0

posted on Mar 21, 2024 10:22AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం (మార్చి 21) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 11 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.  

టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ భక్తలకు శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.  ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

ఇకపోతే బుధవారం (మార్చి 20) శ్రీవారిని 69వేల72 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26వేల 239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 51 లక్షల రూపాయలు వచ్చింది. 

Exit mobile version