Home ఎంటర్టైన్మెంట్ NNS 20th March Episode: అమర్​, మనోహరి వివాహానికి ముహూర్తం పెట్టిన పూజారి.. అరుంధతి ఫొటోను...

NNS 20th March Episode: అమర్​, మనోహరి వివాహానికి ముహూర్తం పెట్టిన పూజారి.. అరుంధతి ఫొటోను మిస్సమ్మ చూస్తుందా?

0

ఫొటో తీసేయడం

ఇంతలో గుప్త ఇంట్లోకి లోపలికి పరిగెత్తుకొస్తాడు. తనని చూసి ఆశ్చర్యపోయిన అందరినీ చూసి “నేనే మీ తోటమాలిని” అంటాడు. “ఏంటయ్యా నువ్వు ఈ వేషం వేసుకున్నావు అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు నువ్వు” అంటాడు శివరామ్​. “అదే నేను ఇందాకన్నుంచి అరుస్తున్నాను సార్‌. తను ఇష్టం వచ్చిన్నప్పుడు వచ్చి ఇష్టం లేనప్పుడు వెళ్లిపోతే ఎలా సార్‌” అంటాడు రాథోడ్​. “అయినా నీకు ఇంట్లో ఏం పని వెళ్లు బయటకి.. ఫస్ట్‌ ఆ గెటప్‌ తీసేవరకు జనాలకు కనిపించకు వెళ్లు” అంటుంది మనోహరి. “నాకొక చిన్న సందేహం అండి. పంతులును అడిగి సమాధానం తెలుసుకునేందుకు వచ్చాను” అంటూ పెళ్లి జరిగే ఈ ఇంట్లో అరుంధతి ఫోటో ఉండటం మంచిదేనా అని గుప్త అడగడంతో పంతులు ఏమీ కాదని చెప్తాడు. బయట అరుంధతితో మాట్లాడుతున్న మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. అదిచూసిన మనోహరి, అరుంధతి, గుప్త టెన్షన్‌ పడుతుంటారు. ఇంతలో మిస్సమ్మకు ఫోన్‌ రావడంతో బయటే ఆగిపోతుంది. దీంతో గుప్త, మనోహరి, అమర్ కు కొన్ని సెంటిమెంట్‌ మాటలు చెప్పి ఫోటో తీయడానికి ఒప్పిస్తారు. దీంతో లీల.. అరుంధతి ఫోటో తీసుకుని లోపలికి వెళ్తుంది. మిస్సమ్మ లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అందరూ వెళ్లిపోతారు.

Exit mobile version