కాఫీ విత్ కరణ్‍కు గట్టి పోటీ!
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ టాక్ షో చాలా ఫేమస్. చాలా ఏళ్ల నుంచి ఆయన సీజన్లుగా ఈ టాక్ షో చేస్తున్నారు. నేషనల్ లెవెల్‍లో దీనికి గట్టి పోటీ లేదు. అయితే, ‘ది రానా కనెక్షన్’ వస్తే.. కాఫీ విత్ కరణ్‍కు మంచి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి సెన్సాఫ్ హ్యూమర్, మాటకారితనం ఉన్న రానా.. టాక్ షోతో మరోసారి ఆకట్టుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బాలీవుడ్‍లోనూ రానాకు మంచి కనెక్షన్లు ఉండటంతో బడా సెలెబ్రెటీలు కూడా ఈ టాక్ షోకు వచ్చే ఛాన్స్ ఎక్కువ.