Home తెలంగాణ సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ, భవనంపై నుంచి పడి యువకుడు మృతి-sangareddy crime to...

సిగరెట్ కోసం స్నేహితుల మధ్య గొడవ, భవనంపై నుంచి పడి యువకుడు మృతి-sangareddy crime to bihar youth fight for cigarettes one falls from building died ,తెలంగాణ న్యూస్

0

Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో(Sangareddy) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్(Bihar) నుండి వచ్చిన ముగ్గురు స్నేహితులు ఓ పరిశ్రమలో పనిచేసుకుంటున్నారు. వీరు పార్టీ చేసుకున్న అనంతరం మద్యం మత్తులో సిగరెట్(cigarette) కోసం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఆ తోపులాటలో ఓ యువకుడు భవనం పై నుంచి పడి మృతి చెందారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్నేహితులు అశోక్, అంకిత్ ,రోషన్ లు బతుకుదెరువు కోసం వచ్చి కంది మండలం ఇంద్రకరణ్ పరిధిలోని ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసుకుంటూ, అక్కడే ఒక ఇంటి పెంట్ హౌస్ లో అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో వీరు ముగ్గురు ఆదివారం రాత్రి ఇంటి పైన మందు పార్టీ చేసుకున్నారు.

Exit mobile version