మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌గా చూస్తుంటుంది. అమర్ వెళ్లిపోతాడు. ఇప్పుడు మిస్సమ్మ ఇంటికి వచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం తెలిసిపోతుందని మనోహరి భయపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసి గుప్త, అరుంధతి షాక్ అవుతారు. అరుంధతి దగ్గరకు వచ్చిన మిస్సమ్మ మనోహరికి నిజం తెలిసిందని చెప్తుంది. ఇంతలో గుప్త లోపలికి వెళ్లి నీ ఫోటో తీసేయిస్తానని వెళ్లిపోతాడు. మరోవైపు లోపల పంతులు ఇద్దరి జాతకాలు చాలా బాగా కలిశాయని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.