Home తెలంగాణ సుప్రీంను ఆశ్రయించిన కల్వకుంట్ల కవిత | kavitha challange arrest in supreme court| illegal|...

సుప్రీంను ఆశ్రయించిన కల్వకుంట్ల కవిత | kavitha challange arrest in supreme court| illegal| liquor| scam

0

posted on Mar 18, 2024 2:33PM

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని పేర్కొంటూ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం ను ఆశ్రయించారు. లిక్కర్ కుంభకోణం కేసులో తన ప్రమేయం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలూ లేవని ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఈడీ డైరెక్టర్ ను చేర్చారు. ఇలా ఉండగా ఈడీ కస్టడీలో కవిత తొలి రోజు విచారణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈడీ అధికారులు విచారణ తతంగాన్నంతా వీడియో తీశారు.

తొలి రోజు విచారణ పూర్తి కాగానే కవితను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులు కలిశారు. అలాగే కవిత భర్త  అనీల్, న్యాయవాది మోహిత్ రావులు కూడా కవితతో భేటీ అయ్యారు. అంతకు ముందు కవిత తరఫున్యాయవాది సుప్రీం కోర్టులో ఇచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించి కవితను అరెస్టు చేసిందని ఆరోపించారు. 

 ఈడీ డైరెక్టర్‌ను చేర్చనున్నారు. కాగా, ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ ఆదివారం పూర్తి అయింది. కవిత విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి తన్నీరు హరీష్, కవిత భర్త అనిల్, లాయర్ మోహిత్ రావు కలిశారు. 

Exit mobile version