Home తెలంగాణ మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు 

మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన విద్యార్థులు 

0

posted on Mar 18, 2024 2:45PM

అధికారం ఒకరిని అందలం ఎక్కిస్తే మరొకరిని పాతాళంలో తోసేస్తుంది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ అయిన మల్లారెడ్డిని  అన్ పాపులర్ చేసింది  ఇప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులే. వీరికి  మరికొందరు తోడయ్యారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు రాజకీయ ప్రత్యర్థులకు బాసటగా నిలుస్తున్నారు.  ఇటీవల మల్లారెడ్డి అల్లుడు ఆక్రమించిన ప్రభుత్వ, ప్రయివేటు భూములను రేవంత్ సర్కార్ స్వాధీనం చేసుకుంది.  మల్లారెడ్డి కబ్జా చేసిన భూములు, మల్లారెడ్డి విద్యాసంస్థలపై కూడా  రేవంత్ సర్కార్  ఉక్కుపాదం మోపింది. మల్లారెడ్డి  తన  విద్యా సంస్థ భవనాన్ని అక్రమంగా కట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. జెసీబీలతో తొక్కించి అక్రమ కట్టడాన్ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్శిటీ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే… పరీక్షల్లో ఒకటి, రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేశారు. దీంతో, వీరంతా ధర్మాకు దిగారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. మరోవైపు యూనివర్శిటీలో ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు

Exit mobile version