Home తెలంగాణ తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు..

తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు..

0

తెలంగాణ మహాత్మా జ్యోతిబాఫులే బీసీ సంక్షేమ (ఎంజేపీటీబీబీసీడబ్ల్యూ), ఎస్సీ (టీఎస్‌డబ్ల్యూ), ఎస్టీ (టీటీడబ్ల్యూ) సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదలైంది.ఇందుకు సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష- ఆర్‌డీసీ సెట్‌-2024 నిర్వహించనున్నారు.TGRDC CET 2024 పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. రెండున్నర గంటల సమయంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. ఇంటర్‌ సిలబస్‌ ఆధారంగానే ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు ఉండవు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. పూర్తి ఉచితంగా విద్యా, వసతి అందిస్తారు.

ప్రవేశాలు కల్పించే కోర్సులివే :- బీఎస్సీ, బీకాం, బీఏ, బీహెచ్‌ఎంసీటీ, బీబీఏ, బీఎఫ్‌టీ

ముఖ్య సమాచారం :- అర్హత :- కనీసం 50శాతం మార్కులతో 2023-24 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు.. పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్య తేదీలు :- దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 2, 2024, దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2024

హాల్ టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభ తేదీ: ఏప్రిల్‌ 21, 2024

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 28, 2024

Exit mobile version