Home తెలంగాణ ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!-khammam crime wife sets husband on...

ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!-khammam crime wife sets husband on fire for earrings ,తెలంగాణ న్యూస్

0

Wife Sets Husband On Fire : భర్త కోసం ప్రాణ త్యాగాలు చేసిన మగువలను చూశాం. యముడితో సైతం పోరాడి భర్త ప్రాణాలను కాపాడుకున్న ఉదంతాలను పురాణాల్లో విన్నాం. అయితే ఇది కలికాల మహత్యం కాబోలు! ఓ భార్య చెవి దిద్దులు కొనివ్వలేదన్న నెపంతో తన భర్త పైనే హత్యాయత్నానికి(Wife Sets Husband On Fire) పాల్పడింది. ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సమీనాను ఖమ్మం(Khammam crime) నగరం నిజాంపేటకు చెందిన యాకూబ్ పాషా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. యాకుబ్ పాషా దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు. కాగా పాషా తల్లి విషయంలో సమీనా కొద్ది రోజులుగా గొడవ పడుతోంది. ఆమెను తమతో ఉంచుకోవడానికి వీలు లేదంటూ భర్తపై ఆంక్షలు విధించేది. దీంతో యాకుబ్ పాషా తల్లికి వేరొక చోట కాపురం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version