Home తెలంగాణ SBI BANK లో భారీ కుంభకోణం

SBI BANK లో భారీ కుంభకోణం

0
  • SBI మూడు బ్రాంచి లలో భారీ కుంభకోణం రూ.20 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్ లు షేక్ సైదులు, గంగ మల్లయ్య….
  • ప్రధాన సూత్రధారి షేక్ సైదులు
  • సూర్యాపేట లో రూ.4.50 కోట్లు, హైదరాబాద్లో రూ.2.84 కోట్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో రూ.10 కోట్లు….
  • రామంతపూర్ మేనేజర్ వీర వసంత రాయుడు పూర్వ మేనేజర్ల పై సీసీఎస్ పోలీస్ లకు పిర్యాదు….
  • సీసీఎస్ పోలీస్ లు విచారణ అనంతరం ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి కేసు బదిలీ..
  • ప్రభుత్వోద్యోగుల అప్లికేషన్లు రిజెక్ట్ చేసి వాటిపైనే కొత్త లోన్లు తీసుకొని EMI కడుతున్న వైనం…
  • బాధితులతో పోలీసులు కూడా…
  • తోవ్వుతున్నా కొద్ది బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్…

SBI లో భారీ కుంభకోణం బయటపడింది. సూర్యాపేట, హైదరాబాద్ లోని రామాంతాపూర్, వెస్ట్ మారేడ్ పల్లి లో షేక్ సైదులు మరో మేనేజర్ భగీరథ గంగ మల్లయ్య తో కలిసి సుమారు రూ.20 కోట్ల భారీమోసానికి పాల్పడ్డాడు. అప్లై చేసుకున్నవారిలోన్లు రిజెక్ట్ చేసి వారి పేర్లపైనే వారికి తెలియకుండారూ. కోట్లు కొల్లగొట్టాడు. మొదట సూర్యాపేటలో రూ.4.5 కోట్లు దోచుకు న్న మేనేజర్ సైదులు తర్వాత హైదరాబాద్ రామాంతపూర్ సీసీజీ శాఖకు వెళ్లాడు. అక్కడ మరోమేనేజర్ భగిరద గంగ మల్లయ్య కలిసి సుమారు 2.8 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డాడు. వెస్ట్ మేరెడ్ పల్లి శాఖలోనూ రూ.10కోట్ల వరకు లోన్లు తీసుకున్నాడు. ఈ విషయం వెలుగు చూడడంతో విచారణ చేయగా అసలు నిజం బయ టపడింది. ఖాతాదారుల గుర్తింపు పత్రాలతో వారికే తెలియకుండా లోన్లు తీసుకున్నట్టు చెబుతున్నారు. బాధితుల్లో మెజారిటీ శాతం ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు. ప్రస్తుతం సూర్యాపేట పోలీసులకు శ్యామ్ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ చేపట్టారు.

బాధితుల్లో పోలీసులు కూడా…

సూర్యాపేట జిల్లాకు చెందిన షేక్ సైదులు సూర్యాపేట నేషనల్ హైవే ఎస్ బీఐ మేనేజర్ గా పని చేశాడు. 2022-23లో 24 మంది పేర్లపై లోన్లు మంజూరు చేయించుకుని రూ.4.50 కోట్లు స్వాహా చేశాడు. ప్రభుత్వోద్యోగం చేస్తూ బ్యాంక్ లోన్ తీసు కునేందుకు అర్హత కలిగిని వారిని ఎంచుకునేవాడు. వారు లోనికోసం అప్లై చేసుకుంటే ఏవో కారణాలు చెప్పి రిజెక్ట్ చేసేవాడు. అదే అప్లికే షన్ ఉపయోగించి మరోసారి దరఖాస్తు చేసేవాడు. ఒక్కొక్కరి పేరు మీద కనీసం రూ.15 లక్షలు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించుకునేవాడు. బాధి తుల్లో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన 11 మంది, వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు. ఎక్సైజ్లో ఇద్దరు, కలెక్టరేట్ లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, మరో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు కలిపి 24 మంది ఉన్నారు.

వెలుగులోకి వచ్చింది ఇలా….. గత సంవత్సరం హైదరాబాద్ రామంతాపూర్ లోని సీసీజీ (కమర్షియల్ క్లయిట్ గ్రూప్) మేనేజర్ సైదులు బదిలీ అయ్యాడు. ఇక్కడ మరో మేనేజర్తో కలిసి సూర్యాపేట తరహాలోనే ఇక్కడా లోన్లు తీసుకు న్నాడు. ఈ లోన్లకు ఈఎంఐలు కూడా కడుతున్నాడు. ఫ్రాడ్ చేసిన మేనేజర్ గంగ మల్లయ్య బదిలీ కావడంతో ఆయన స్థానం లో వసంత రాయుడు అనే మేనేజర్ వచ్చాడు. ఆయనకు కొన్ని ఖాతాలపై అనుమానం రావడంతో చెక్ చేయగా గుట్టు బయటపడింది. ఎంక్వైరీ మొదలుపెట్టడం తో సైదులు పరారయ్యాడు. సూర్యాపేటలో కూడా తాను తీసుకున్న లోన్లకు ప్రతినెలా ఈఎంఐ కడుతున్న సైదులు పారిపోయిన తర్వాత డబ్బులు కట్టడం. ఆపేశాడు. దీంతో 2024 ఫిబ్రవరి ఈఎంఐ కట్టలే దంటూ పలువురు ఉద్యోగులకు నోటీసులువెళ్లాయి. దీంతో బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. వారు సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. బాధితులు సంఖ్య మరింత పెరిగితే ఈ మోసం రూ.20కోట్లు దాటుతుందని అంచనా.

Exit mobile version