Home ఎంటర్టైన్మెంట్ HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

HanuMan OTT Telugu: నిరీక్షణ ముగిసింది.. తెలుగులో స్ట్రీమింగ్‍కు వచ్చేసిన హనుమాన్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

0

Hanu-Man OTT Telugu Streaming: ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. హనుమాన్ సినిమా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ తెలుగు సూపర్ హీరో మూవీ జనవరి 12వ తేదీన రిలీజై సూపర్ హిట్ అయింది. తెలుగు, హిందీ సహా రిలీజైన అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. సుమారు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. హనుమాన్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా రోజులుగా ప్రేక్షకులు ఎదురుస్తున్నారు. అయితే, ముందుగా హిందీలో వచ్చింది. కాగా, ఎట్టకేలకు నేడు (మార్చి 17) హనుమాన్ సినిమా తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

Exit mobile version