Home ఆంధ్రప్రదేశ్ AP SSC Exams 2024 : ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి-...

AP SSC Exams 2024 : ఏపీలో రేపట్నుంచి పదో తరగతి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి- విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

0

అభ్యర్థుల సంఖ్య:

  • రెగ్యులర్ అభ్యర్థులు- 6,23,092
  • మొత్తం బాలుర సంఖ్య- 3,17,939
  • మొత్తం బాలికల సంఖ్య- 3,05,153
  • OSSC అభ్యర్థులు- 1,562
  • తిరిగి నమోదు చేసుకున్న అభ్యర్థులు- 1,02,528

రాష్ట్ర వ్యాప్తంగా 3473 పరీక్షా కేంద్రాలు

రాష్ట్రంలో మొత్తం 3,473 పరీక్షా కేంద్రాలు(Exam Centers) ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రా లలో అభ్యర్థులకు సౌకర్యంగా బెంచీలు, సరిపడా వెలుతురు, ఫ్యాన్లు, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు(3473), డిపార్ట్‌మెంటల్ అధికారులు (3473), ఇన్విజిలేటర్లు(32,000) , ఇతర సహాయక సిబ్బందిని నియమించామన్నారు. పరీక్షా (AP SSC Exams)కేంద్రాల వద్ద అవకతవకలను తనిఖీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 682 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో నిఘా కోసం CCTV కెమెరాలు అమర్చినట్లు అధికారులు తెలిపారు. కాన్ఫిడెన్షియల్ ఎగ్జామినేషన్ మెటీరియల్, 12/24 పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌లు, గ్రాఫ్ షీట్‌లు, ఇతర ఎగ్జామినేషన్ మెటీరియల్‌లు ఇప్పటికే జిల్లా ప్రధాన కేంద్రాలకు పంపించామన్నారు.

Exit mobile version