Home తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

0
  • హైదారాబాద్ నుంచి ముంబైకి బయల్దేరిన రేవంత్, మల్లు భట్టి, పొన్నం
  • టేకాఫ్ అయిన వెంటనే విమానంలో సాంకేతిక లోపం
  • గంటన్నర ఆలస్యమైన విమానం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ సమస్య తలెత్తింది. విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే విమానంలో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వీరంతా ముంబైకి వెళ్తున్నారు. మరమ్మతుల అనంతరం విమానం ముంబైకు బయల్దేరింది.మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే విమానంలో వీళ్లంతా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ విమానంలో మొదటి వరుసలో ఏ2 సీట్లో రేవంత్ కూర్చున్నారు. సాంకేతిక సమస్య కారణంగా విమానం గంటన్నర ఆలస్యం అయింది.

 

Exit mobile version