వేల కోట్లు ఆర్థిక నేరాలు చేసి దేశ విడిచి పారిపోయిన వాళ్ళని తీసుకురావడానికి చేతకాదు గాని, ఒక మహిళను మాత్రం రాత్రికి రాత్రి అరెస్టు చేసి తీసుకుపోవడం మోదీ సర్కారే కే దక్కిందని, మహేశ్వరం నియోజకవర్గంలో గల మహేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన మహా ధర్నా కార్యక్రమంలో, మాజీ మంత్రి మహేశ్వరం శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మాటలను ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ చెప్పిన దానికి కెసిఆర్ సహకరించలేదని, ఆమె కూతురును టార్గెట్ చేశాడని, కవిత ఒకరికి సహాయం చేద్దామని ఫోను మాట్లాడితే, ఆ స్కామ్ లో కవిత కూడా ఉన్నదని ఇరికించడం జరిగిందని, న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉన్నాదని, న్యాయపోరాటం చేసి కవితను స్వచ్ఛందంగా విడిపించుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులు ప్రసంగించారు. అలాగే బిఆర్ఎస్ శ్రేణులు అత్యధికంగా పాల్గొన్నారు.