Home తెలంగాణ ఇద్దరు యువకుల నుండి 5.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్.

ఇద్దరు యువకుల నుండి 5.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్.

0

SOT మేడ్చల్ టీమ్ సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని హేమావతి నగర్, హమాలీబస్తీ, మోతీనగర్ చెందిన రాకేష్‌ అనే పాత నేరస్తుని పట్టుకుని అతని ఇంటి నుండి 1.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతనిచ్చిన సమాచారం మేరకు బల్కంపేట్ ప్రాంతంలోని అతని స్నేహితుడు పవన్ ఇంట్లో మరో 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు :- వీరిద్దరూ భువనేశ్వర్‌కు నుండి గంజాయి ని తీసుకుని వచ్చి సనత్ నగర్ మరియు బల్కంపేట పరిసరాలలో రోజువారీ కూలీలకు మరియు విద్యార్థులకు చిన్న చిన్న పాకెట్స్ గా చేసి అమ్ముతున్నట్లుగా తెలిసింది. ఒరిస్సా నుండి తీసుకుని వచ్చిన 6 కేజీల గంజాయి నుండి 700 గ్రాముల గంజాయిని చిన్న పాకెట్లలో కూలీలకు అమ్మారు అని తెలిసింది.

నిందితుల వివరాలు :- 1) కొమరె రాకేష్ S/o రాజు వయస్సు 23, Occ పెయింటింగ్, కులం SC మాదిగ R/o H.No.8-4-358, హేమావతి నగర్, హమాలీ బస్తీ, మోతీనగర్. పాత నేరస్థుడు

2) గండిగూడెం పవన్ కుమార్ S/o కృష్ణ, వయస్సు 25, Occ బ్యాండ్ వర్క్, R/o H.No. 7-1-38/101, బ్లకంపేట్. హైదరాబాద్.

రాకేష్ గతంలో ఈ కింది కేసుల్లో అరెస్ట్ కావడం జరిగింది.

  •  1) Cr.No. 339/2016 U/s 379 IPC సనాతంగర్ PS
  •  2) Cr.No. 631/2017 U/s 394 IPC సనంతనగర్ PS
  • 3) Cr.No. 519/2023 U/s 20(b)(ii)(C) NDPS ACT సనంతనగర్ PS.

సనత్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version