గత ఏడాది రికార్డ్ స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు
గత సంవత్సరం జులై మొదటి వారంలో రికార్డు స్థాయిలో 5.10 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేశారు. హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) చరిత్రలో మొట్టమొదటిసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షల దాటింది. రహదారుల పైన వాహనాలు రద్దీ, కాలుష్యం తదితర కారణాలు దృశ్య నగరవాసులు మెట్రోకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. మరో వైపు వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేని విధంగా పూర్తి ఏసీ సదుపాయంతో ప్రయాణం అందజేయడంతో ఎక్కువగా మెట్రో రైల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపే వారు.కేవలం నగరవాసులే కాకుండా పర్యాటకులు, వివిధ పనుల రీత్యా హైదరాబాద్ కు వచ్చిన వాళ్లు సైతం మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం….. మియాపూర్ – ఎల్బీనగర్(Miyapur LB Nagar) కార్డినర్ లో ప్రతిరోజు 2.6 లక్షల మంది ప్రయాణించగా….నాగోల్ – రాయదుర్గం కారిడార్ లో 2.25 లక్షల మంది రాకపోకలు సాగించారు. జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు రోజుకు 25,000 మంది ప్రయాణం చేశారు. కానీ మహాలక్ష్మి పథకం కారణంగా ఈ మూడు కారిడార్ లలో కలిపి కేవలం ఇప్పుడు 30 వేల మందికి పైగా మహిళలు సిటీ బస్సులోకి మారినట్లు మెట్రో అధికారులు తెలిపారు.