Home తెలంగాణ  లిక్కర్ కేసులో కవితకు 10 రోజుల రిమాండ్ 

 లిక్కర్ కేసులో కవితకు 10 రోజుల రిమాండ్ 

0

posted on Mar 16, 2024 5:45PM

లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి నేత , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కస్టడీకి డిల్లీ కోర్టు శనివారం అప్పగించింది.

ఈ కేసులో శుక్రవారం కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే  అనంతరం కోర్టులో కవితను ఈడీ హాజరుపర్చింది.

విచారణ నిమిత్తం కవితను 10రోజుల రిమాండ్‌‌కు అప్పగించాలని ఈడీ కోరింది.

దీంతో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుల ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎంకె.నాగ్‌పాల్ ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. అరెస్టుకు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలను సమర్పించారు. ఇదిలా ఉండగా ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బెయిల్ లభించడం కవిత మాత్రం 10 రోజుల కస్టడీలో ఉండడం చర్చనీయాంశమైంది. 

Exit mobile version