Wednesday, December 4, 2024

ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

posted on Mar 16, 2024 4:30PM

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య  దేశమైన భారత్ లో 18వ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరుగుతుంది. అలాగే సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్  విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో మే 13నే జరగనున్నాయి.  

ఇక సార్వత్రిక ఎన్నికల తొలి దశ కు  మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుందని అన్నారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరుతుందని తెలిపారు. ఇక రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల , ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. అలాగే మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12న మే 7న పోలింగ్  జరుగుతుంది. నాలుగో దశకు  ఏప్రిల్ 18న నోటిఫికేషన్  మే 13న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ దశలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ లోక్ సభ ఎన్నికలు పూర్తి అవుతాయి.  అదే విధంగా ఐదో దశ పోలింగ్  మే 20న, ఆరో దశ మే 25న, ఏదో దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది.

మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి జూన్ 4న. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక పోలే దేశంలో 96 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 49కోట్ల 70లక్షలు పురుష,  47 కోట్ల పదిలక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా కోటీ 85లక్షల మంది యువత ఈ ఎన్నికలలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు కాకుండా 48 వేల ట్రాన్స్ జండర్లు, 88లక్షల 40 వేల మంది దివ్యాంగులూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana