posted on Mar 16, 2024 4:30PM
ఇక సార్వత్రిక ఎన్నికల తొలి దశ కు మార్చి 20న నోటిఫికేషన్ విడుదలవుతుందని అన్నారు. ఏప్రిల్ 19న పోలింగ్ జరుతుందని తెలిపారు. ఇక రెండో దశ ఎన్నికలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల , ఏప్రిల్ 26న పోలింగ్ జరుగుతుంది. అలాగే మూడో దశ నోటిఫికేషన్ ఏప్రిల్ 12న మే 7న పోలింగ్ జరుగుతుంది. నాలుగో దశకు ఏప్రిల్ 18న నోటిఫికేషన్ మే 13న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ దశలోనే ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు, తెలంగాణ లోక్ సభ ఎన్నికలు పూర్తి అవుతాయి. అదే విధంగా ఐదో దశ పోలింగ్ మే 20న, ఆరో దశ మే 25న, ఏదో దశ పోలింగ్ జూన్ 1న జరుగుతుంది.
మొత్తం ఏడు దశల ఓట్ల లెక్కింపు, ఫలితాల వెళ్లడి జూన్ 4న. ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక పోలే దేశంలో 96 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు ఉండగా వారిలో 49కోట్ల 70లక్షలు పురుష, 47 కోట్ల పదిలక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా కోటీ 85లక్షల మంది యువత ఈ ఎన్నికలలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరు కాకుండా 48 వేల ట్రాన్స్ జండర్లు, 88లక్షల 40 వేల మంది దివ్యాంగులూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.