Home తెలంగాణ  లిక్కర్ స్కాం కేసులో  కేజ్రీవాల్ కు ఊరట 

 లిక్కర్ స్కాం కేసులో  కేజ్రీవాల్ కు ఊరట 

0

posted on Mar 16, 2024 11:01AM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో, ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరారు. కోర్టు బెయిల్ ఇవ్వడం కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరటగా భావించవచ్చు. అయితే, ఆ సమన్లను దాటవేస్తున్న కేజ్రీవాల్.. రాజకీయ ప్రేరేపిత కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం.. తమను వేధించేందుకే ఈ కేసులు పెట్టించిందని ఆరోపణలు చేస్తున్నారు.

కాగా, ఢిల్లీ మధ్యం కేసులో ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ అరవింద్‌ కేజ్రీవాల్‌ పెట్టుకున్న అభ్యర్థనను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం ట్రయల్‌ కోర్టును ఆశ్రయించాలని అదనపు సెషన్స్ జడ్జి రాకేశ్‌ సియాల్ సూచించారు. అంతేకాదు, కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో మాజీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా అరెస్టైన సంగతి తెలిసిందే. తెలంగాణ మాజీ సి ఎం కెసీఆర్ కుమార్తె కవితను నిన్ననే ఈ కేసులో అరెస్ట్ చేశారు. 

Exit mobile version