Home అంతర్జాతీయం US concerned about CAA: సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన; నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్య

US concerned about CAA: సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన; నిశితంగా గమనిస్తున్నామని వ్యాఖ్య

0

ఎవరి పౌరసత్వాన్ని లాక్కోం: అమిత్ షా

అయితే సీఏఏ అంటే పౌరసత్వం ఇవ్వడమేనని, ఈ పౌరసత్వ సవరణ చట్టం (CAA) వల్ల దేశంలోని ఏ పౌరుడూ పౌరసత్వాన్ని కోల్పోడని కేంద్రం పేర్కొంది. సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తమ దేశంలో భారత పౌరసత్వాన్ని నిర్ధారించడం తమ సార్వభౌమ హక్కు అని, దీనిపై తాము ఎన్నడూ రాజీపడబోమని, సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలకు వేరే పని లేదని అమిత్ షా అన్నారు. ‘‘ఒకటి చెప్పి మరొకటి చేసిన చరిత్ర వారికి ఉంది. అయితే ప్రధాని మోదీ, బీజేపీ చరిత్ర వేరు. బీజేపీ కానీ, ప్రధాని మోదీ కానీ ఏదైనా చెప్పారంటే.. అది రాతిలో చెక్కినట్లే. మోదీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం’’ అన్నారు.

Exit mobile version