డీప్ ఫ్రై చేసే వంటకాలు ప్రతిరోజూ తినడం ఆరోగ్యకరం కాదు. ఒకసారి ఈ రాగి పకోడీ చేసుకుని తినండి మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. రాగులు సులువుగా అరుగుతాయి. అలాగే త్వరగా ఆకలి కూడా వేయకుండా అడ్డుకుంటాయి. హైబీపీతో బాధపడేవారు రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. రాగులు తినడం వల్ల గుండె, ఉబ్బసం, కాలేయ వ్యాధులు రాకుండా ఉంటాయి. రాగి పిండి ప్రాసెస్ చేయకుండా లభిస్తుంది. రాగులు తెచ్చి మిల్లు దగ్గర మర పట్టించుకున్నా చాలు. వీటిలో పకోడీలే కాదు, రోటీలు, దోశెలు, ఇడ్లీలు, ఉప్మా, పరాటాలు వంటివి చేసుకుని తినవచ్చు.