వనపర్తి మార్చ్ 15 జనవాహిని న్యూస్ ప్రతినిధి :- పానగల్ వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జిల్లాలోపదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధా నోపాధ్యాయులు విష్ణువర్ధన్ రెడ్డి మండల విద్యాధికారి శ్రీ లక్ష్మణ్ నాయక్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారువిద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ జరిగింది వారు మాట్లాడుతూ ఈ ఉత్తమ విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచి ఎస్ఎస్సి ఎక్సమ్ లో తమ ప్రతిభ చాటాలని తాము మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షిస్తూ మా విద్యార్థులే భావితరాల భవిష్యత్తుకు నిదర్శనమని వారు అన్నారు టెన్త్ లో అత్యధిక మార్కులో అందరూ తమ ప్రతిభ కనబరిచి ఏ గ్రేట్ లో అందరూ ఉత్తీర్ణత పొంది మంచి భవిష్యత్ శ్రీకారం చుడతారని మా విద్యార్థుల పట్ల మాకు పూర్తి నమ్మకం ఉందని ఈరోజు మా విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఉపాధ్యాయులు తెలపడం జరిగింది.