కొండపైకి ఆటోలు…
కొద్దిరోజులుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించారు. ఆలయన పునర్ నిర్మాణం తర్వాత… కొండపైకి ఆటోలు వెళ్లకుండా నిషేధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆటోలు కొండపైకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ఇందులో భాగంగా… ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తున్నాయి. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. షిఫ్టుకు 50 ఆటోలు చొప్పున రాకపోకలు కొనసాగిస్తున్నాయి. 25 ఆటోలు కొండపైన ఉంటే, మరో 25 కొండ కింద ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.