సోయా ఉత్పత్తులు
సోయా పాలు, సోయాబీన్స్, సోయా చంక్స్… ఇలా సోయా ఉత్పత్తులు మార్కెట్లో చాలా ఉన్నాయి. సోయాబీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా అలెర్జీ కారకంగానే పనిచేస్తుంది. సున్నితమైన చర్మాన్ని కలిగిన వ్యక్తుల్లో ఇవి అలెర్జీలను పెంచుతాయి. సోయాతో చేసిన ఉత్పత్తులు తిన్నాక దద్దుర్లు వంటివి కనిపిస్తే వాటిని తినడం తగ్గించండి.