శివి అంటే శుభం, అనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్ధాలు. శు అంటే శివుడని, వి అంటే శక్తి అని శివపదమణిమాలి చెబుతోంది. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడో జాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు.